శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 24, 2020 , 16:19:36

అసెంబ్లీ ఉద్యోగులకు పండ్లు పంపిణీ

అసెంబ్లీ ఉద్యోగులకు పండ్లు పంపిణీ

అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా మిత్రులకు సి విటమిన్ కలిగిన  బత్తాయి పండ్లను శాసన మండలి చైర్మన్ శ్రీ  గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.  కరోన మహమ్మరిని నిర్ములించడానికి సి విటమిన్ ఎక్కువగా ఉన్న బత్తాయి, నిమ్మ పండ్లను ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు  నల్గొండ జిల్లాలో  తానే స్వయంగా బత్తాయి పండ్లను  అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా మిత్రులకు అందజేశారు.కరోన కారణంగా బత్తాయి పండ్లను ప్యాకింగ్ చేసి హైదరాబాద్ పంపడానికి వర్కర్లు ఎవరు అందుబాటులో లేకపోవడంతో తానే స్వయంగా ప్యాకింగ్ చేసి ఈ రోజు ఉదయం పోలీస్ పర్మిషన్ ఉన్న వెహికల్ లో అసెంబ్లీ కి పంపించారు. 

తన చేతుల మీదుగా పంపిణీ చేయాలి అనుకున్న నల్గొండ లో బిజీగా ఉండటం వలన అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు సహకారం తీసుకొని సెక్రటరీ, టీఆర్‌ఎస్‌ ఎల్పీ రమేష్ రెడ్డి చేతుల మీదుగా అసెంబ్లీ స్టాఫ్ మీడియా మిత్రులకు బత్తాయి పండ్లు పంపిణీ చేయించారు. కరోన నివారణ కొరకు ప్రజలు సంపూర్ణంగా లాక్ డౌన్ ని పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలి అన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడం కొరకు సి విటమిన్ ఎక్కువగా ఉండే బత్తాయి, నిమ్మ పండ్లను తినాలి అని సూచించారు. పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ తమ స్టాఫ్, మీడియా ప్రతినిధుల ఆరోగ్యం కొరకు బత్తాయి పండ్లను పంపిణీ చేసారని అన్నారు. ప్రజలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారని, త్వరలోనే తెలంగాణ కరోన రహిత రాష్ట్రం అవుతుంది అని నమ్మకం ఉందని అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ చార్యులు చెప్పారు.logo