శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 00:56:25

పత్రికారంగానికి వన్నెతెచ్చిన పొత్తూరి

పత్రికారంగానికి వన్నెతెచ్చిన పొత్తూరి

తెలుగు యూనివర్సిటీ: పత్రికారంగానికి  పొత్తూరి వెంకటేశ్వర్‌రావు వన్నెతెచ్చారని, ఆయన చేసిన కృషి అనిర్వచనీయమని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ కొనియాడారు. పాత్రికేయులు పొత్తూరి సంతాపసభ శనివారం నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలోని కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంశాఖ ఆధ్వర్యంలో ఆచార్య వడ్లకొండ సత్తిరెడ్డి అధ్యక్షతన జరిగింది. తెలుగు వర్సిటీ పొత్తూరి పేరిట ఏటా స్మారకోపన్యాస పురస్కారాన్ని ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కే రామచంద్రమూర్తి కోరారు. కార్యక్రమంలో ప్రజాపక్షం, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు కే శ్రీనివాస్‌రెడ్డి, కే శ్రీనివాస్‌, ఆంధ్రభూమి పూర్వ సంపాదకుడు ఎంవీఆర్‌ శాస్త్రి, ప్రభు త్వ సలహాదారు టంకశాల అశోక్‌, వర్సిటీ రిజిస్ట్రార్‌ భట్టు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo