ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 19, 2020 , 18:30:10

బైక్‌పై వచ్చి చైన్‌స్నాచింగ్‌

బైక్‌పై వచ్చి చైన్‌స్నాచింగ్‌

వికారాబాద్‌: జిల్లాలోని తండూరు పట్టణంలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు దుకాణంలో కూల్‌డ్రింక్‌ ఇవ్వమని అడిగి షాపు యజమానురాలి మెడలో గొలుసు లాక్కుని బైక్‌పై పరారయ్యాడు. ఆమె కేకలు విన్న స్థానికులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తవారు, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. 


logo