మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 18:51:53

కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్..తల్లీ,బిడ్డ క్షేమం

కరోనా సోకిన గర్భిణికి సిజేరియన్..తల్లీ,బిడ్డ క్షేమం

పెద్దపల్లి : కొవిడ్ సోకిన గర్భిణికి వైద్యలు విజయవంతంగా ఆపరేషన్ చేసి పండంటి బిడ్డకు పురుడు పోసిన సంఘటన జిల్లాలోని గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానలో చోటుచేసుకుంది. సింగరేణి కార్మికుడు లంకా రాజశేఖర్ భార్య స్వర్ణలత పురిటి నొప్పులతో గురువారం రాత్రి దవాఖానలో చేరింది.  కాగా, ఆమె జ్వరంతో బాధపడుతున్నది. డాక్టర్స్  కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్య  చొరవ తీసుకుని సిజేరియన్ చేసి పండంటి బిడ్డకు పురుడు పోశారు. కరోనా పేషెంట్ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వైద్య బృందాన్ని సింగరేణి జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.


logo