శుక్రవారం 03 జూలై 2020
Telangana - Apr 28, 2020 , 14:41:27

జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం

జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్‌ : నగరంలో కరోనా నివారణ, ఇతర సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను కేంద్ర బృందం నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా కంట్రోల్‌ రూం నుంచి అందిస్తున్న పేవలను కేంద్ర బృందం తెలుసుకుంది. మంత్రులు, జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాల వీడియోలను బృంద సభ్యులు వీక్షించారు. కంట్రోల్‌ రూమ్‌కు నిత్యం 500కు పైగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని.. అదీ కూడా ఆహారం, నిత్యావసరాలపైనే ఎక్కువ ఫోన్లు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కూలీలు, దివ్యాంగులకు ఆహారం అందించడంలో సాయం చేస్తున్నట్లుగా తెలిపారు. ఆహారం పంపిణీ చేసిన వారి వివరాలను, ఎంతమందికి ఆహారం అందిందనే వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకుంది. దాతలు, సాయం కోరిన వారికి ఫోన్‌ చేసి వివరాలడిగింది. పారిశుద్ధ్య, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్‌ వారి సేవలను కేంద్ర బృందం అభినందించింది.


logo