గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రాందీ డైరీస్’. శివుడు దర్శకుడు. శ్రీకాంత్ లేళ్లతో పాటు అతడి మిత్రబృందం కలిసి నిర్మించారు. ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘టైటిల్ మాదిరిగానే సినిమా గమ్మత్తుగా సాగుతుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశమిది. మద్యపానానికి వ్యతిరేకంగా సందేశంతో ఈ సినిమా చేయలేదు. ఆల్కహాల్‌కు అలవాటుపడిన వారి జీవితాలకు నాటకీయత, వినోదాన్ని మేళవించి రూపొందించాం’ అని తెలిపారు. కథే హీరోగా నమ్మి వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఏప్రిల్ 9న లేదా 10న విడుదలచేస్తే మంచి థియేటర్లు దొరికే అవకాశముందని, ‘అర్జున్‌రెడ్డి’ తరహాలో యువతరాన్ని ఈ సినిమా మెప్పిస్తుందని తుమ్మలపల్లి రామసత్యనారాయణ పేర్కొన్నారు. ట్రైలర్‌తో పాటు పెంచలదాస్ రాసిన పాటకు చక్కటి స్పందన లభిస్తోందని హీరో గరుడ శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, సునీత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’