ఆదివారం 31 మే 2020
Telangana - May 01, 2020 , 13:33:31

రాష్ట్రం చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది : మంత్రి తలసాని

రాష్ట్రం చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది : మంత్రి తలసాని

హైదరాబాద్‌ : కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కరోనా వచ్చిన నెలన్నర తర్వాత కాంగ్రెస్‌ నేతలు నిద్ర లేచారన్నారు. బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. బస్సుల్లో వలస కూలీల తరలింపు సాధ్యం కాదని నిన్ననే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి చెప్పామన్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి కూలీలను తరలించాలని సూచించినట్లుగా మంత్రి పేర్కొన్నారు.


logo