బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 20:46:02

కేంద్రం ప్యాకేజీ ఉత్త బోగస్ : సీఎం కేసీఆర్

కేంద్రం ప్యాకేజీ ఉత్త బోగస్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: కరోనా లాంటి మహమ్మారిపై పోరు చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పేరుతో ప్రకటించిన ప్యాకేజీ బోగస్‌ అని సీఎం కేసీఆర్‌ కొట్టిపారేశారు. కేంద్రం ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరైనా అని సీఎం ఎద్దేవా చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని  సీఎం కేసీఆర్‌  మండిపడ్డారు. కేంద్ర ప్యాకేజీ దగా, మోసమన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ర్టాలను భిక్షగాళ్లను చేస్తారా..అని సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo