ఆదివారం 12 జూలై 2020
Telangana - May 28, 2020 , 19:31:40

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: సోమేశ్‌ కుమార్‌

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో పీపీఈ కిట్లు, మాస్కులు, టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు సరిపడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు, లాక్‌డౌన్‌, కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి కేంద్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఆయన చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. 


logo