కేంద్రానివి రాజ్యాంగ ఉల్లంఘనలు

- ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాలి
- ఓట్ల కోసమే బీజేపీ కవ్వింపు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ఆరేండ్లుగా అనేక రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని, దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో న్యాయవాదులు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని తాము పోరాటం చేశామని, రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. 2014లో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిందన్నారు. రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం అనేక చట్టాలను చేస్తున్నదని విమర్శించారు.
రాజ్యాంగంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి న్యాయవాదులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రాష్ర్టాలకు చట్ట ప్రకారం రావాల్సిన జీఎస్టీ బకాయిలను కేంద్రం చెల్లించకుండా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నదని సాక్షాత్తు కాగ్ రిపోర్టు స్పష్టంచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ ఇతరుల పట్ల ద్వేష భావంతో మాట్లాడలేదని, ఓట్ల కోసం బీజేపీ నాయకులు పోటీపడి మరీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కేవలం ఓట్ల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ ఒకటిన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో న్యాయవాదులంతా టీఆర్ఎస్కు మద్దతుగా నిలువాలని విజ్ఞప్తిచేశారు.
ఆరేండ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి అభివృద్ధి
చేయలేదు. కాబట్టే.. మతం పేరుతో ఓట్లు అడుగుతున్నది. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు బడ్జెట్లో రూ.1,000 కోట్లు
కేటాయించింది. ఉద్యోగుల
సంక్షేమానికి సమ్మెనాటిజీతాలకు రూ.235 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ సంస్థల రక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
-గాంధీనగర్లో ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తాజావార్తలు
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి
- మైనారిటీల మెప్పు కోసం దీదీ తాపత్రయం : బీజేపీ
- యాదాద్రి..కేసీఆర్ కలల ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్
- పసిడి స్మగ్లింగ్: చెన్నైలో తొమ్మిది మంది అరెస్ట్
- భారీ మంచులో మహిళను ఆరు కిలోమీటర్లు మోసిన జవాన్లు