గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 19:32:44

సంక్షేమ పథకాలను అభినందించడం హర్షణీయం : మంత్రి ఎర్రబెల్లి

సంక్షేమ పథకాలను అభినందించడం హర్షణీయం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అభినందించడం హర్షణీమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. నానాజీ దేశ్‌ముఖ్ గౌర‌వ్ గ్రామస‌భ పుర‌స్కార్, ఫ్రెండ్లీ పంచాయ‌తీ పుర‌స్కార్, దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌త్ అవార్డులు సాధించిన జడ్పీ, మండ‌ల‌, పంచాయ‌తీల‌ ప్రజాప్రతనిధులు, అధికారులకు రంగారెడ్డి జడ్పీ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాల‌యంలో సోమ‌వారం రూ. కోటి 47 ల‌క్షల చెక్కుల‌ను అంద‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిధులు ఇవ్వక‌పోయినా, కేంద్రం తెలంగాణ ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలను అభినందించడం గర్వకారణమని పేర్కొన్నారు.  స్వచ్ఛ భార‌త్, పారిశుద్ధ్యం, మంచినీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్ స‌ర‌ఫ‌రా తదితర క‌నీస స‌దుపాయాల క‌ల్పన‌లో రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. సీఎం కేసీఆర్ చేప‌ట్టిన ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమం విజ‌య‌వంతంగా అమ‌లు అవుతుంది. ప‌ల్లెల్లో ప‌చ్చద‌నం, ప‌రిశుభ్రత, ఆహ్లాద వాతావ‌ర‌ణ ప‌రిఢ‌విల్లుతున్నది. విజయవంతంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 

కేంద్రంనిధుల‌ను అంద‌జేయాల‌ని మంత్రి కోరారు. పంచాయ‌తీల‌కు ఎప్పుడూ లేనివిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందుతున్నాయ‌న్నారు. ప్రతి నెలా రూ.307 కోట్లు పంచాయతీలకు అంద‌జేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  ఈ సందర్భంగా ప్రోత్సాహక చెక్కులు అందుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి స‌త్కరించారు. కార్యక్రమంలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌నర్ ర‌ఘునంద‌న్ రావు తదితరులు పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.