ఆదివారం 23 ఫిబ్రవరి 2020
ప్రజలందరి ఆరోగ్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు

ప్రజలందరి ఆరోగ్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు

Feb 15, 2020 , 13:20:33
PRINT
ప్రజలందరి ఆరోగ్యాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు

హైదరాబాద్‌: ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. నగరంలోని హోటల్‌ తాజ్‌కృష్ణలో కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ వార్షిక సదస్సు నిర్వహణ ఇవాళ జరిగింది. ఈ సదస్సులో గవర్నర్‌ తమిళిసై, మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా ఉందన్నారు. సోనాలజిస్ట్‌గా ఎన్నో హృదయాల చప్పుడు తాను వినేదాన్నని అన్నారు. యుక్త వయసులోనే ఎంతో మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారన్నారు. సులభంగా గుండె మార్పిడి చేసేంత కార్డియాలజీ విభాగంం ప్రస్తుతం అభివృద్ధి చెందిందన్నారు.  

మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ... తెలంగాణలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. గర్బిణిల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలు, గుడ్లు అందిస్తుందన్నారు. అదేవిధంగా కేసీఆర్‌ కిట్‌ ద్వారా గర్బిణులకు ఆర్థికంగా అండగా ఉంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల మందికిపైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. క్యాన్సర్‌ నివారణ కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. హరితహారం కోసం తపిస్తున్న మొట్ట మొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.


logo