సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ : ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లను బడ్టెట్‌లో పొందుపరిచి సంపూర్ణంగా అమలు చేయాలని మంత్రి హరీశ్ రావు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు అమలు చేయకపోవడంతో తెలంగాణ రూ.723 కోట్లు నష్టపోయిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ముందుంచారు. కేంద్రం వసూలు చేస్తోన్న సెస్, సర్ ఛార్జీలను రద్దు చేసి రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్థికసాయం అందించాలన్నారు.
గతేడాది, ఈ ఏడాదితో కలిపి రాష్ట్రానికి రావాల్సిన రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. మహిళా సంఘాల వడ్డీ రాయితీ పథకాన్ని 50 శాతం జిల్లాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారని, అన్ని జిల్లాలకు వర్తింపజేసి బకాయి మొత్తాన్ని విడుదల చేయాలి. బీహార్‌లో ప్రకటించిన విధంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయాలి. ఎన్ఎస్ఏపీ పథకం కింద ఏళ్ల నుంచి దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు కేంద్రం కేవలం రూ.200 మాత్రమే సాయం అందిస్తుంది. ఈ సాయాన్ని కనీసం వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పరిహారం సత్వరమే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి. ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!