బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:26:26

ఈఎంఎస్‌కు కేంద్రం రూ.183 కోట్ల బకాయి

ఈఎంఎస్‌కు కేంద్రం రూ.183 కోట్ల బకాయి

  • విడుదలచేయాలని కేంద్ర కార్మికమంత్రికి లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా లేఖ 
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఈఎంఎస్‌)కు రావాల్సిన బకాయి రూ.183 కోట్లు వెంటనే విడుదలచేయాలని కేంద్రాన్ని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కోరారు. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌గంగ్వార్‌కు గురువారం లేఖ రాశారు. రాష్ర్టానికి గతేడాదిగాను రూ.147.37 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటివిడుతగా రూ.35.45 కోట్లు.. మొత్తంగా రూ.182.82 కోట్లు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర కార్మిక నుంచి రావాల్సిన నిధులు వచ్చేవిధంగా చూడాలని నామాకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్రంమంత్రికి నామా లేఖ రాశారు. మందులు, సర్జికల్‌ అంశాలకు రూ.140 కోట్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో సరఫరాదారుల నుంచి ఒత్తిడి వస్తున్నదని తెలిపారు. ఇటీవల గవర్నర్‌, కార్మికశాఖ మంత్రి ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో పర్యటించినప్పుడు క్యాన్సర్‌, డయాలసిస్‌ రోగుల వైద్యసౌకర్యాలకు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, దీనికోసం అదనంగా రూ.126 కోట్లు అవసరమని పేర్కొన్నారు.


logo