రాష్ర్టాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం : ఎంపీ నామా

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రూపాయి కూడా ఇచ్చింది లేదని. అంతేకాకుండా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్రం అడ్డుకుంటుందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బండి సంజయ్ అన్నీ అవాస్తవాలే చెబుతున్నారన్నారు. బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మరన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి కేపీహెచ్‌బీకాలనీలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ, హైదరాబాద్ గురించి ఎన్నడూ పార్లమెంటులో బండి సంజయ్ మాట్లాడలేదన్నారు. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధిని పార్లమెంటులో అడ్డుకుంటున్నాడన్నారు. రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ నగదు గురించి బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగనే లేదన్నారు. కేంద్రంలో డబ్బు వచ్చేది లేదు. కేంద్రం వద్దా డబ్బే లేదన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని బీజేపీ తన మేనిఫెస్టోలో చూపెడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం పలు చర్యలు చేపట్టిందన్నారు. ఎన్టీఆర్ ఘాట్, పీవి ఘాట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం రక్షణగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్, పీవీల పేర్లను ఎన్నడూ పలకని బీజేపీ ఓట్ల కోసం మాత్రం ఎన్టీఆర్, పీవీ ఘాట్లను అడ్డం పెట్టుకుంటుందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
- కార్లు.. బారులు
- బుద్ధవనాన్ని సందర్శించిన సమాచార కమిషనర్
- కూలీల ట్రాక్టర్ బోల్తా
- నాలుగు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- క్రీడలతో మానసిక ప్రశాంతత
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్‌లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం