మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 07:47:27

‘సెల్ట్‌'లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

‘సెల్ట్‌'లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ (సెల్ట్‌)లో పలు కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెల్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సవీన్‌ సౌడ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎ కోర్స్‌ ఇన్‌ ఇంగ్ల్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌'పేరుతో నిర్వహించే రెండు నెలల కోర్సుకు ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు, సాయంత్రం 6గంటల నుంచి 8 గంటల వరకు వేర్వేరుగా తరగతులను ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘ఎ కోర్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌'పేరుతో నిర్వహించే ఒక నెల కోర్సుకు ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు తరగతులను ఈనెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9652856107, 7416575575 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.logo