ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 20:23:54

రూ.658కోట్ల పనులకు కేంద్రం ఆమోదం : మంత్రి ఎర్రబెల్లి

రూ.658కోట్ల పనులకు కేంద్రం ఆమోదం : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : పీఎంజీఎస్‌వై-౩, బ్యాచ్‌-1లో రూ.658.31 కోట్ల విలువైన పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 1,119.94 కిలోమీటర్ల మేర, 152 పనులకు ప్రతిపాదనలు పంపగా, అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల‌కు రోడ్లు వేసే అవ‌కాశం ఉంటుందని చెప్పారు. కొత్త‌గా గ్రామాల నుంచి మండ‌ల కేంద్రాల‌కు లింకు రోడ్లు కూడా వేసే వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే  కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన ప‌నులను వెంట‌నే ప్రారంభించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆయా ప‌నుల‌ను నాణ్య‌త‌తో, వేగంగా పూర్తి అయ్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.


logo