మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 11:48:28

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

మంచిర్యాల : సింగరేణి కార్మికులకు 28శాతం లాభాల్లో వాటా ప్రకటించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీరాంపూర్‌ ఓసీపీపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఆధ్వర్యంలో కార్మికులు సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. లాభాల్లో వాటా ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డీ అన్నయ్య రీజియన్ కార్యదర్శి మల్లారెడ్డి ఫిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్ పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo