బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 14:54:35

కేసుల విచార‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం: సీపీ అంజ‌నీ కుమార్‌

కేసుల విచార‌ణ‌లో సీసీ కెమెరాలు కీల‌కం: సీపీ అంజ‌నీ కుమార్‌

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్ పోలీస్‌శాఖ అన్ని రంగాల్లో ముందుంద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ అన్నారు. కేసుల విచార‌ణ‌కు సీసీ కెమెరాలు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని చెప్పారు. అంబ‌ర్‌పేట్‌లో రూ.2.45 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాల‌ను స్థానిక‌ డీసీపీ కార్యాల‌యంలో ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, సీపీ అంజ‌నీ కుమార్‌తో క‌లిసి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. అన్ని విష‌యాల్లో ప్ర‌జ‌ల నుంచి స‌హ‌కారం ల‌భిస్తున్న‌ద‌ని తెలిపారు. ప్ర‌తి పోలీస్ స్టేష‌న్‌లో సామాజిక మాధ్య‌మాల ద్వారా 30 నుంచి 40 శాతం ఫిర్యాదులు న‌మోద‌వుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌తి కేసులో ముఖ‌గుర్తింపు ప‌రిజ్ఞానం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. చీక‌ట్లో సైతం ముఖాల‌ను గుర్తించే సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉంద‌ని వెల్ల‌డించారు. పోలీసులు బాగా ప‌నిచేస్తున్నార‌ని కిష‌న్ రెడ్డి ప్ర‌శంసించారు. 


logo