మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 11:17:54

పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు.. ఉద్యోగిపై కేసు

హైదరాబాద్‌ : పటాన్‌చెరు ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయం ఉద్యోగి భారత్ రెడ్డి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. రూ.3 వేలు లంచం తీసుకున్నట్టుగా తేలడంతో అతడిని తనిఖీలు చేయగా నగదు లభించలేదు. కార్యాలయంలో వెతకగా డబ్బులు లభించడంతో కేసు నమోదు చేశారు. రాత్రి ఒంటిగంట సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తమ కార్యాలయానికి తరలించారు. పూర్తి వివరాలను సీబీఐ కార్యాలయం నుంచి సమాచారం ఇస్తామని ఓ అధికారి తెలిపారు. అధికారులు తమ పేర్లను చెప్పేందుకు నిరాకరించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo