Telangana
- Jan 10, 2021 , 01:23:04
పశువుల హాస్టల్ భేష్

- మంత్రి హరీశ్‌రావుకు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో పశువుల కోసం కమ్యూనిటీ డెయిరీ హాస్టల్‌ను ప్రారంభించి, నియోజకవర్గంలో మరో ఎనిమిది చోట్ల వీటి ఏర్పాటుకు కృషిచేస్తున్న ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావును ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్లో ప్రశంసించారు. డెయిరీ ఉత్పత్తులు పెంచేందుకు ఇలాంటి సౌకర్యాలు దోహదపడుతాయని పేర్కొన్నారు.
‘రాజన్న ఎరువు’ అద్భుతం
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాలు ఇంటింటా సేకరించిన తడిపొడి చెత్తతో ‘రాజన్న సేంద్రియ ఎరువు’ పేరిట కంపోస్ట్ ఎరువును తయారుచేస్తుండటం అద్భుతమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇటు రైతులకు మేలు జరుగుతుందని, అటు పల్లెలు పరిశుభ్రంగా మారుతాయని సర్పంచ్‌లను ట్విట్టర్లో అభినందించారు. ఇదేస్ఫూర్తితో అన్ని గ్రామాలు ముందుకెళ్లాలని అభిలషించారు.
తాజావార్తలు
- రైతు సంక్షేమానికి సర్కారు కృషి : మండలి చైర్మన్ గుత్తా
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్‌కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
MOST READ
TRENDING