ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 12:10:47

టీఆర్ఎస్ పాలనలోనే కుల వృత్తులకు ప్రాధాన్యం

టీఆర్ఎస్ పాలనలోనే కుల వృత్తులకు ప్రాధాన్యం

వరంగల్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఅర్ ఆధ్వర్యంలో కుల వృత్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పశుఆరోగ్య శిబిరాన్నిమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, కలెక్టర్ హరితతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడానికి పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. పశువులకు దాన, గడ్డి సమస్య లేకుండా అలాగే వ్యాక్సిన్ విషయంలో కూడా ముందుండి చొరవ తీసుకుంటున్న ప్రభుత్వం కేసీఅర్ ప్రభుత్వం అన్నారు.

 వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవనం కొనసాగించే వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. జాతీయ కృత్రిమ గర్భాధారణ దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం లోని రాయపర్తిలో పశువుల వైద్య శిబిరాన్ని ప్రారంభించటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 


logo