గురువారం 28 మే 2020
Telangana - Apr 30, 2020 , 22:45:32

ఏజెంట్‌ చేతివాటం.. వృద్ధుల అకౌంట్‌ నుంచి నగదు స్వాహా

ఏజెంట్‌ చేతివాటం.. వృద్ధుల అకౌంట్‌ నుంచి నగదు స్వాహా

రాజన్న సిరిసిల్ల : వృద్ధుల అమాయకత్వం.. నిరక్షరాస్యతను అదనుగా తీసుకుని ఓ నోవా పే ఏజెంట్‌ చేతివాటం ప్రదర్శించాడు. అకౌంట్లలోని డబ్బులను స్వాహా చేస్తున్నాడు. దీనిని గుర్తించిన బాధితులు ఇదేమని నిలదీయడంతో నెట్‌వర్క్‌ సమస్యవల్లే జరిగిందని, తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తానని ఒప్పుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన శ్రీరామోజు రవి (35) సంవత్సర కాలంగా నోవా పే ఏజెంటుగా పనిచేస్తున్నాడు. పింఛన్‌ తదితర డబ్బుల విత్‌డ్రా కోసం తన వద్దకు వస్తున్న వృద్ధులలో అమాయకులను టార్గెట్‌ చేసుకుని చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. వారి బ్యాంకులోని డబ్బులన్నీ డ్రా చేసి కొంత సొమ్మును మాత్రమే వారికి ముట్టజెప్పుతూ, మిగతా సొమ్మును స్వాహా చేస్తున్నాడు. ఇటీవల గ్రామానికి చెందిన ఆల్వాల లచ్చవ్వను అదేవిధంగా మోసం చేయగా, అనుమానం వచ్చిన ఆమె నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 


logo