బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 20:19:52

అధిక ధ‌ర‌ల‌కు ఎరువులు అమ్మితే కేసులు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

అధిక ధ‌ర‌ల‌కు ఎరువులు అమ్మితే కేసులు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌గాం : అధిక ధ‌ర‌ల‌కు ఎరువులు అమ్మినా, ధ‌ర‌ల ప‌ట్టిక సూచిక‌ను ప్ర‌ద‌ర్శించ‌క‌పోయినా, రైతులను ఎలాంటి ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్లు తెలిసినా స‌ద‌రు దుకాణాల‌పై కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దుకాణ‌దారుల‌ను హెచ్చ‌రించారు. పాల‌కుర్తిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించారు. ఎరువులు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న విష‌య‌మై సీరియ‌స్ అయ్యారు. అధికారులు వెంట‌నే రంగంలోకి దిగాల‌ని ఆదేశించారు. 

రాష్ట్రంలోని అనేక చోట్ల ఎరువులు, పురుగుల మందులు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌న్నారు. అంతేగాక కొంద‌రు య‌జ‌మానులు ర‌సాయ‌నాలు, పురుగుల మందులు, గుళిక‌లు కొంటేనే యూరియా ఇస్తామ‌ని నిబంధ‌న‌లు పెట్ట‌డం,  లేదంటే ఆధార్ కార్డు కావాలంటూ నానా ర‌కాలుగా వేధిస్తున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు.  ఇలాంటి వాళ్ల‌ని ఉపేక్షించ‌వ‌ద్ద‌న్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వం రైతుల‌ను రాజుల‌ను చేయాల‌ని సాగునీరు, పెట్టుబ‌డి, 24 గంట‌ల విద్యుత్ అందిస్తూ స‌కాలంలో ఎరువులు, విత్త‌నాలు అందుబాటులో ఉంచితే, కొంద‌రు వ్యాపారులు ఇలా రైతుల్ని ఇబ్బందుల‌కు గురి చేయ‌డం క్ష‌మించ‌రాని నేర‌మ‌న్నారు. 


logo