బుధవారం 08 జూలై 2020
Telangana - Feb 21, 2020 , 12:38:13

యువతిని వేధించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు

యువతిని వేధించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్లలో యువతిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. స్టేషన్‌కు వచ్చిన యువతిని లైంగికంగా వేధించినట్లు కానిస్టేబుల్‌పై ఆరోపణలు. యువతి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అదేవిధంగా మరొక ఘటనలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండలం జలాల్‌పూర్‌లో బాలికను వేధిస్తున్న యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. యువకుడు తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా బాలికను వేధిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


logo