ఆదివారం 31 మే 2020
Telangana - May 18, 2020 , 00:07:52

పెళ్లి ఊరేగింపు, 20 మందిపై కేసు నమెదు

పెళ్లి ఊరేగింపు, 20 మందిపై కేసు నమెదు

గుర్రంపోడ్‌ : అన్ని అనుమతులతో పెళ్లి చేశారు.. పెళ్లి విందు పెట్టారు.. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా బరాత్‌ నిర్వహించారు. దీంతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సంఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌ మండలం కొప్పోలులో జరిగింది. ఎస్‌ఐ డి.సైదులు వివరాల ప్రకారం..  కొప్పోలు గ్రామంలో కరోనా కారణంగా పరిమిత కుటుంబ సభ్యులతో శివరాజ్‌, స్వాతిల వివాహం జరిగింది. 

అనంతరం బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ రాత్రి లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి బ్యాండు మేళాలు, డీజేతో పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. దీంతో పెళ్లిబృందంలోని యువకులు డ్యాన్సులతో హోరెత్తించారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు గ్రామంలోకి వెళ్లగా ఈ విషయం తెలిసింది. దీంతో పెళ్లిబృందంతోపాటు, డీజే, బ్యాండ్‌ మేళం వారు మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి హెచ్చరించారు. 


logo