బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 04, 2020 , 19:06:08

ముగ్గురు వైద్యులపై కేసు నమోదు...

ముగ్గురు వైద్యులపై కేసు నమోదు...

రంగారెడ్డి: జిల్లాలోని చేగూరు ఘటనలో మూడు ఆస్పత్రులను ప్రభుత్వం సీజ్‌ చేసింది. ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులపై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన మహిళకు వైద్యులు చికిత్స అందించారు. కరోనా లక్షణాలు గురించకుండా నిర్లక్ష్యంగా వైద్యం అందించారని ఆరోపణ. కరోనా లక్షణాలతో ఎవరు వైద్యానికి వచ్చినా ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ ఆస్పత్రికి సమాచారం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 


logo