శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 20:01:24

హోం క్వారంటైన్‌ పాటించని యువకుడిపై కేసు

హోం క్వారంటైన్‌ పాటించని యువకుడిపై కేసు

నిజామాబాద్‌: జిల్లాలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి పై కోసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్ ఐ మచెందర్ రెడ్డి తెలిపారు.. ఈ నెల13న దుబాయ్ నుండి బస్వాపూర్ కు వచ్చాడు ఇంటి వద్దనే ఉండాలని అధికారులు ఎన్ని సార్లు చెప్పిన పట్టించు కోకుండా బయట గ్రామాలకు తిరగడం వల్ల  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అతని పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. బయట దేశాల నుంచి  జిల్లాకు సుమారు మూడు వేల మంది వచ్చి ఉన్నారని వారిలో ఎవరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా తెలియదని వారి నుండి వారి ఇళ్ల లోని భక్తులకు ఎవరికి ఇది వ్యాప్తి చెందిందో  తెలియదని కావున పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడె ప్రార్థనా మందిరాల కు భక్తులను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పూజారులను కోరారు.  జిల్లాలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇతర అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆయన ప్రతి ఒక్కరికి సూచించారు. ఈ ఆదేశాలను పూజారులు అందరు తప్పకుండా పాటించాలని, అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.


logo