బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 10:02:52

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సర్పంచ్‌పై కేసు

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సర్పంచ్‌పై కేసు

కొండపాక : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఇది పూర్తిస్థాయిలో అమలుజరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బాధ్యతలను అందించింది. కానీ ఇందుకు విరుద్దంగా ప్రభుత్వం సూచించిన నిబందనలను పాటించకుండా ఓ సర్పంచ్‌ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు సర్పంచ్‌పై కేసు నమోదు చేశారు. కుకునూర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్‌ గ్రామ సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంగించి  అర్ధరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరపుకున్నాడు.

సుమారు 15మంది సభ్యులతో కలిసి మాస్కులు దరించకుండా, సామాజిక దూరాన్ని పాటించకుండా కేక్ ను కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి బాధ్యతగా మెలగాల్సిన గ్రామ సర్పంచ్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌తో పాటు మరో 9మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.logo