గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 22:13:38

తుపాకీతో బెదిరింపులు..కాంట్రాక్టర్ పై కేసు

తుపాకీతో బెదిరింపులు..కాంట్రాక్టర్ పై కేసు

నల్లగొండ: తుపాకితో బెదిరింపులకు పాల్పడిన చేపల చెరువు కాంట్రాక్టర్‌పై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ పరమేష్ మాట్లాడుతూ... మండల పరిధిలోని శ్రీనివాసనగర్‌ శివారు నల్లకుంట చెరువును గాయం ఉపేందర్‌రెడ్డి అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. ఈ విషయంలో సొసైటీ సభ్యుల మధ్య వివాదం నెలకొని కోర్టును ఆశ్రయించడంతో మూడేళ్లుగా చేపలు పట్టడానికి వీల్లేకుండాపోయింది. 

ఈ నేపథ్యంలో గత నెల 28న దుబ్బతండా సర్పంచ్‌ కుమారుడు హరిబాబు నల్లకుంట చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే పరిసర ప్రాంతాల ప్రజలు చేపలు పట్టేందుకు యత్నిస్తుండడంతో కాపలాదారుడు సజ్జన్‌ కాంట్రాక్టర్‌కు ఫోన్‌ చేశాడు. హుటాహుటిన చేరుకున్న ఉపేందర్‌రెడ్డి అక్కడే ఉన్న హరిబాబుపై తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించాడు. హరిబాబు ఫిర్యాదు మేరకు ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.logo