గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 21:19:39

నకిలీ మహిళా విలేకరిపై కేసు

నకిలీ మహిళా విలేకరిపై కేసు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాకేంద్రంలో టీవీ ఎన్‌7 చానల్‌ క్రైం రిపోర్టర్‌నని చెప్పుకుంటూ బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్న మహిళా విలేకరి రేకందర్‌ ప్రియదర్శినిపై పట్టణ సీఐ ముత్తి లింగయ్య కేసు నమోదు చేసినట్లు డీపీఆర్‌ఓ సంపత్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 4వ తేదీన మంచిర్యాల పట్టణంలోని విశాల్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి మాట్లాడేది ఉందని, క్వాలిటీ బేకరీ వద్దకు రావాలని పిలిచింది. 

విశాల్‌ తనతో పాటు కుంట శ్రీధర్‌, గౌతం అనే ఇద్దరు మిత్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ప్రియదర్శిని, ఆమె అనుచరులు ట్యాంక్‌ రాహుల్‌, సందీప్‌, సందగర్జ్జ్రు, గోలోతు విశాల్‌, కుశాల్‌, నాగరాజు కలిసి వారిపై దాడి చేశారు. విశాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. విశాల్‌ ఫిర్యాదు మేరకు ప్రియదర్శినితో పాటు ఆమె అనుచరులపై సీఐ కేసు నమోదుచేసినట్లు డీపీఆర్‌ఓ పేర్కొన్నారు.logo
>>>>>>