ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Apr 28, 2020 , 13:12:53

అబార్షన్‌ ఘటనలో వైద్యుడి సహా మరో ఇద్దరిపై కేసు

అబార్షన్‌ ఘటనలో వైద్యుడి సహా మరో ఇద్దరిపై కేసు

భద్రాద్రి కొత్తగూడెం : అబార్షన్‌ ఘటనలో పోలీసులు వైద్యుడి సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. పాల్వంచకు చెందిన యువతి రెండేళ్లక్రితం కొత్తగూడెంకు చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. కాగా అప్పట్లో వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. తాజాగా సీమంతం పేరుతో యువతి ఈ నెల 22వ తేదీన తీసుకువచ్చి భద్రాచలం ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించారు. యువతి భర్త ఫిర్యాదు మేరకు అబార్షన్‌ చేసిన వైద్యుడు, చేయించిన తల్లి, అమ్మమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.

VIDEOS

logo