శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 10:37:04

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన కార్లు.. వీడియోలు

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన కార్లు.. వీడియోలు

హైద‌రాబాద్‌:  తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో గ‌త రెండు రోజుల నుంచి భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో లోత‌ట్టు ప్రాంతాల్లో వ‌రద నీరు ఉప్పొంగించింది. ఆ నీటి ఉదృతికి .. రోడ్ల‌పై పార్క్ చేసిన వాహ‌నాలు కొట్టుకుపోయాయి.  మంగ‌ళ‌వారం రోజంతా భారీ వ‌ర్షం న‌మోదు కావ‌డంతో.. రాత్రి వ‌ర‌కు వీధుల‌న్నీ న‌దుల‌ను త‌ల‌పించాయి. అయితే రాత్రిపూట ప‌లు ప్రాంతాల్లో కార్లు నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయి.   ద‌మ్మాయిగూడ‌లో ఇండ్ల మ‌ధ్య వ‌రద నీరు హోరెత్తించ‌డంతో అక్క‌డ ఉన్న ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. స‌రూర్‌న‌గ‌ర్‌లోని గ్రీన్‌పార్క్ కాల‌నీలో కూడా రెండు వాహ‌నాలు కొట్టుకుపోయాయి.     


logo