శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 20:19:57

అంటువ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

అంటువ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : అంటువ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు సూచించారు. ‘ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో  పారిశుద్ధ్య ప‌నులు చేశారు. మొక్కలకు నీళ్లు పోసి ట్యాంకుల్లో, తొట్లలో నిల్వ నీటిని తొలగించారు. చెత్తా చెదారం శుభ్రం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సీజన్ వ్యాధుల నివారణే లక్ష్యంగా ‘ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప‌చ్చద‌నం-పరిశుభ్రత‌, ప‌ల్లె ప్రగ‌తి, ప‌ట్టణ ప్రగ‌తి, స్వచ్ఛ హైద‌రాబాద్ తదితర కార్యక్రమాలు చేప‌ట్టి పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. అదేవిధంగా ఆరోవిడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


logo