బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 08:05:40

వాగులో కొట్టుకుపోయిన కారు.. మ‌హిళ గ‌ల్లంతు

వాగులో కొట్టుకుపోయిన కారు.. మ‌హిళ గ‌ల్లంతు

జోగులాంబ గ‌ద్వాల‌(ఉండ‌వెల్లి) : జిల్లాలో శుక్ర‌వారం రాత్రి నుంచి వ‌ర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడ‌తెరిపి లేకుండా వాన ప‌డుతోంది. దీంతో జిల్లాలోని వాగులు, వంక‌ల‌కు వ‌ర‌ద పోటెత్తింది. క‌లుగొట్ల వాగు స‌మీపంలో ప్ర‌యాణిస్తున్న కారు వ‌ర‌ద‌లో కొట్టుకుపోయింది. ఈ ఘ‌ట‌న శ‌నివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

శివ‌కుమార్ రెడ్డి అనే వ్య‌క్తి త‌న భార్య సింధూ రెడ్డి, స్నేహితుడు జిలానీ బాషాతో క‌లిసి బెంగ‌ళూరు నుంచి హైద‌రాబాద్‌కు శుక్ర‌వారం రాత్రి బ‌య‌ల్దేరాడు. శ‌నివారం తెల్ల‌వారుజామున 6:30 గంట‌ల స‌మ‌యంలో.. పుల్లూరు మీదుగా హైవే ఎక్కేందుకు క‌లుగొట్ల వాగు వైపు వెళ్లారు. అక్క‌డ వ‌ర‌ద ఉధృతి ఎక్కువ ఉండ‌డంతో.. కారు కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదం నుంచి శివ‌కుమార్ రెడ్డి, జిలానీ బాషా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. సింధూ రెడ్డి వ‌ర‌ద నీటిలో గ‌ల్ల‌తైంది. 

వాగు వ‌ద్ద‌కు చేరుకున్న స్థానికులు, పోలీసులు క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌హిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ఉండ‌వెల్లి సీఐ వెంక‌ట్రామ‌య్య ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. త‌న భార్య కోసం శివ‌కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాడు. 


logo