శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 16:51:21

వరద ఉదృతికి వాగులో కొట్టుకుపోయిన కారు

వరద ఉదృతికి వాగులో కొట్టుకుపోయిన కారు

బోనకల్లు : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. వరద ప్రవాహాలతో వాగులు, వంకలు పొంగి ప్రహిస్తున్నాయి. ఈ క్రమంలో బోనకల్లు మండలం చిన్న బీరవల్లి గ్రామ సమీపంలోని వాగు వరద ఉదృతికి పోటెత్తింది. వరద ఉదృతికి తాళలేక కారు వాగులో కొట్టుకుపోయింది. వైరా జగ్గయ్యపేట ప్రధాన రోడ్డుమార్గంలో జానకిపురం వద్ద రహదారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కురిసి వర్షాలకు రెండు లారీలు దిగుబడిపోయాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రా పల్లె క్రాస్‌రోడ్‌ చిన్న బీరపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇదే సమయంలో బోనకల్లు వెళ్లేందుకు ఇండికా కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. వాగుపై బ్రిడ్జిని దాటేక్రమంలో వరద ఉదృతి పెరగడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే వాగులోకి దూకి నలుగురికి రక్షించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

తాజావార్తలు


logo