బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 20:02:00

మ‌ల‌క్‌పేట‌లో త‌గ‌ల‌బ‌డిన కారు.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

మ‌ల‌క్‌పేట‌లో త‌గ‌ల‌బ‌డిన కారు.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

హైద‌రాబాద్ : కారు త‌గ‌ల‌బ‌డిన ఘ‌ట‌న‌లో ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. ఈ సంఘ‌ట‌న న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట రైల్వే స్టేష‌న్ స‌మీపంలో శ‌నివారం సాయంత్రం చోటుచేసుకుంది. కారులో నుండి మంట‌లు ఒక్క‌సారిగా చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కారులోని న‌లుగురు వ్య‌క్తులు సుర‌క్షితంగా కిందికు దిగారు. చూస్తుండ‌గానే కారు పూర్తిగా కాలిపోయింది. రోడ్డుపై కారు త‌గ‌ల‌బ‌డ‌టంతో ట్రాఫిక్ కాసేపు స్తంభించింది. 


logo