సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 13:47:21

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బోల్తా

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బోల్తా

హైదరాబాద్‌: రాజేంద్ర నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తున్న కారు పిల్లర్‌ నంబర్‌ 170 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ హర్ష అగర్వాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు క్రేన్‌ సాయంతో కారును పక్కకు తొలగించారు. 


logo