శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 01:14:52

తిరుమలలో శ్రీరామనవమి రద్దు

తిరుమలలో శ్రీరామనవమి రద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ వేములవాడ కల్చరల్‌: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలతోపాటు తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దుచేసింది. ఉగాది పం చాంగ శ్రవణం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వ హించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.  శ్రీకోదండరామస్వామి ఆలయంలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవా లు ప్రారంభమయ్యా యి. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి తదితరులు పాల్గొన్నారు. 

భద్రాచలంలో నిరాడంబరంగా.. 

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు నిరాడంబరంగా నిర్వహించాలని ని ర్ణయించారు. బుధవారం ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 2న శ్రీసీతారాముల తిరుకల్యాణం, మరుసటిరోజున శ్రీరామపట్టాభిషేకం నిర్వహిస్తారు. 

ఎములాడ ఆలయంలో.. 

వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వా మి ఆలయంలో ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వ హించాల్సిన రాములోరి లగ్గంతోపాటు  ర థోత్సవాన్ని రద్దుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉగాది పంచాంగ శ్రవణం ఆలయం లోపల అర్చకులతో మాత్రమే నిర్వహించనున్నారు. 

నేడు ఆలయాల్లో హోమాలు

కరోనా వైరస్‌ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ప్రార్థిస్తూ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పలు ఆలయా ల్లో హోమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం హో మం నిర్వహించారు. మంగళవారం కాళేశ్వరం దేవాలయం, గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయం, మెదక్‌ జిల్లా ఏడుపాయల దుర్గభావాని దేవాలయాల్లో మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తారు. 


logo