బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:35:25

శ్రీవారి దర్శనం.. స్థానికులకే

శ్రీవారి దర్శనం.. స్థానికులకే

  • ఇతర ప్రాంతాల భక్తులకు అనుమతి రద్దు 
  • ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు ఆంక్షలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వైకుంఠ ఏకాదశికి ఇతర ప్రాంతాల భక్తులను అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగే ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజుకు 10వేల మంది స్థానికులకు మాత్రమే స్వామి దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను రోజుకు 20వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో మంగళవారం కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు హడలెత్తిపోయారు. ఆలయ సిబ్బంది అప్రమత్తమై దానిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు.         


logo