శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 17:32:06

అన్నిశాఖల అధికారుల సెలవుల రద్దు : కలెక్టర్‌

అన్నిశాఖల అధికారుల సెలవుల రద్దు : కలెక్టర్‌

 హైదరాబాద్‌ : భారీ వర్షాల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో అన్నిశాఖల అధికారులు సెలువులు రద్దు చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులెవరూ సెలువులు పెట్టవద్దని ఆయన సూచించారు.  అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లరాదని కోరారు. స్థానిక సమస్యలు, వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రతి అధికారి తమ పరిధిలోని రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని చెప్పారు.  వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు దృష్ట్యా అధికారుల‌కు ప్రభుత్వం సెలవులు ర‌ద్దు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి బట్టి లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌ల‌ను అప్రమత్తం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్రజల‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.