శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 02:03:21

10 వరకు మల్లన్న మూలవిరాట్‌ దర్శనాలు నిలిపివేత

10 వరకు మల్లన్న మూలవిరాట్‌ దర్శనాలు నిలిపివేత

చేర్యాల, జనవరి 2: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి మూలవిరాట్‌ దర్శనాన్ని ఆదివారం సాయంత్రం నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు  ఆల య ఈవో బాలాజీ శనివారం తెలిపారు. 10 తేదీన స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా స్వామి మూల విరాట్‌తోపాటు అమ్మవార్ల విగ్రహాలకు పంచరంగుల అలంకరణ నిమిత్తం దర్శనం నిలిపివేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మూలవిరాట్‌ దర్శనం నిలిపివేసిన తేదీల్లో భక్తులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కాగా, శనివారం ఆలయంలోని హుండీలను లెక్కించగా  రూ.56,58,590తోపాటు  98 గ్రాముల మిశ్రమ బంగారం, 6.1 కిలో  మిశ్రమ వెండి, 1,100 కిలోల మొక్కుబడి బియ్యం, 8 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్టు ఈవో తెలిపారు.


logo