శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 19:56:06

కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్‌ దర్శనాలు నిలిపివేత

కొమురవెల్లి మల్లన్న మూలవిరాట్‌ దర్శనాలు నిలిపివేత

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి మూలవిరాట్‌ దర్శనాన్ని ఆదివారం సాయంత్రం నుంచి 10వ తేదీ వరకు నిలిపివేస్తున్న ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. శనివారం ఆలయంలో ఆయన మాట్లాడుతూ 10వ తేదీన స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా మూలవిరాట్‌తో పాటు అమ్మవార్ల విగ్రహాలకు పంచరంగుల అలంకరణ సందర్భంగా దర్శనాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10న ఉదయం 6గంటల తర్వాత  స్వామి వారి మూలవిరాట్‌ పునః దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. స్వామి వారి మూలవిరాట్‌ దర్శనం నిలిపివేసిన తేదీలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మూలవిరాట్‌ దర్శనం లేని రోజుల్లో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు దర్శనం, పూజ కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని ఈవో కోరారు.