'వచ్చిన ఐటీఐఆర్‌ను రద్దు చేసి ఐటీ హబ్ చేస్తాడంట'

హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐ.టీ.ఐ.ఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తిరిగి ఇప్పుడు నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని బీజేపీ నాయకులు అంటున్నరు. ఇంతటి చిత్రం ఎక్కడైనా ఉందా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిమిత్తం నగరానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని అన్నారు. దీనిని తిప్పకొడుతూ మంత్రి కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ అభ్యర్థులకు మద్దతుగా పాటిగడ్డలో మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బేగంపేట డివిజన్ నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి మహేశ్వరి, మోండా మార్కెట్ నుంచి ఆకుల రూప, రాంగోపాల్‌పేట నుంచి అరుణ, అమీర్‌పేట నుంచి శేషు కుమారి, బన్సీలాల్‌పేట నుంచి హేమలత, సనత్‌నగర్ నుంచి కొలను లక్ష్మిబాల్‌రెడ్డి లను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా కోరారు.
నగరానికి వస్తున్న ఢిల్లీ టూరిస్టులకు వెల్కం. కానీ వస్తూ వస్తూ వరద సాయం తెస్తరేమో అని ఎదురుచూశాం. ఒక్కరంటే ఒక్కరూ కూడా ఈ విషయంలో స్పందించలేదన్నారు. పేదవారికి సాయం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంటే అమ్మ పెట్టదు అడ్డుక్కు తిననీయదు అన్నట్టు బీజేపీ తీరు ఉందన్నారు. వరదల భారిన పడినవారిలో ఇప్పటికే 6 లక్షల 64 వేల కుటుంబాలకు సాయం అందించాం. మిగతావారిని డిసెంబరు 7 నుంచి ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ రద్దు చేసి ఇవాళ ప్రపంచంలో మేటి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని అమిత్ షా అంటే నమ్మడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరన్నారు. తమది నిజాం సంస్కృతి అంటున్నరు. కానీ హైదరాబాద్ సంస్కృతి గాంధీ-జమునా తెహజీబ్ అని 1920లోనే మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఒక్కసారి చూడాలన్నారు.
అబద్దపు ప్రచారాలకు ప్రజలు ఆగం కావొద్దన్నారు. విషయం లేనివాళ్లే విషం చిమ్ముతారన్నారు. హిందు, ముస్లిం, సిక్కులు కలిసి ఉండొద్దు వారికి. ఆంధ్రా-తెలంగాణ పంచాయితీలు లేవు. ఇట్లుంటే వాళ్లకు ఓట్లు వస్తయ్. అందుకే ఇది కూలగొడతం, అది కూలగొడతం అంటున్నరు. తామేమో డ్రైనేజీలు కడతం, రోడ్లు కడతం, చెరువులు బాగుచేస్తం, లైట్లు బాగుచేస్తం, పిల్లలకు కొలువులు వచ్చేలా చూస్తాం, సీసీ కెమెరాలు పెడతామంటుంటే.. వాళ్లేమో కూలగొడతం అంటున్నరన్నారు. ఆలోచించాల్సిందిగా కోరారు.
ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలే. తమ నినాదం విశ్వనగరం. వాళ్ల విధానం విద్వేష నగరం అన్నారు. హైదరాబాద్‌లో అన్నదమ్ముల్లా కలిసుందామని తామంటుంటే కాదు కాదు కలిసి ఉండొద్దు. ఒకల్నిఒకలు అనుమానంతో చూసుకోవాలె.. తెల్లారిలేస్తే తన్నుకోవాలే.. తెల్లారిలేస్తే కొట్టుకోవాలె.. కచ్చితంగా కర్ఫ్యూ రావాలే అని వాళ్లు చూస్తున్నరన్నారు. ఈ పంచాయతీలు పెట్టే, చిల్లరమల్లర రాజకీయం చేసే దుర్మార్గపు రాజకీయ పార్టీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. మీ ఓటు అనే పవర్ఫుల్ ఆయుధాన్ని ఉపయోగించి పవర్ఫుల్ తీర్పుతో మనకోసం పనిచేస్తున్న కేసీఆర్‌ను, మన పేదల కోసం, మన నగరం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సింది కోరారు.
తాజావార్తలు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
- స్పుత్నిక్-వీ మూడో విడత ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి
- అడవి అందాలను ఆస్వాదిద్దాం!
- ఈ రోజు మీ రాశిఫలాలు
- గ్రేటర్ ఓటర్లు.. 87.65 లక్షలు
- ఆ సీక్రెట్ ప్లేస్‌ను.. పసిగట్టలేకపోయారు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు