గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 17:00:26

కాల్వల పూడికతీత పనులు చేపట్టాలి : మంత్రి సింగిరెడ్డి

కాల్వల పూడికతీత పనులు చేపట్టాలి : మంత్రి సింగిరెడ్డి

వనపర్తి : ఉపాధిహామీలో భాగంగా కాల్వల పూడికతీత పనులను చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్‌లో మంత్రి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, జెడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని తెలిపారు. పట్టాదారు పాస్‌బుక్కు ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అందుతుందని మంత్రి పేర్కొన్నారు.


logo