ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:36:11

ప్రశాంతంగా ఎంసెట్‌ ప్రారంభం

ప్రశాంతంగా ఎంసెట్‌ ప్రారంభం

  • తొలిరోజు 77.52 శాతం హాజరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు పరీక్షలకు తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 77.52% హాజరు నమోదైనట్టు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు నిర్వహించిన పరీక్షలకు 77.29%, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 77.76% హాజరు నమోదైందని వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రారంభించిన ఎంసెట్‌కు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని, గురువారం హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంసెట్‌ ఈ నెల 14 వరకు కొనసాగనున్నది.


logo