బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 19:37:08

కూరగాయలు, పండ్లు కావాలా.. ఈ నెంబర్‌కు కాల్‌ చేయండి

కూరగాయలు, పండ్లు కావాలా.. ఈ నెంబర్‌కు కాల్‌ చేయండి

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ జంటనగర వాసులకు కూరగాయలు, పండ్లు సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 254 వాహనాలలో 504 పాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసింది. వినియోగదారులకు కావాల్సిన పండ్లు, కూరగాయాలు అందుబాటులో ఉంచుతున్నారు. కూరగాయలు కావాల్సిన కాలనీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు ముబైల్‌ నెంబర్‌ 7330733212 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఏం కూరగాయాలు కావాలో చెబితే మీ అపార్ట్‌మెంట్‌, కాలనీ ముందు కూరగాయల వ్యాను రడీగా ఉంటుందని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. logo