సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:12

దసరా నాటికి కేబుల్‌ బ్రిడ్జి పూర్తి మంత్రి గంగుల వెల్లడి

దసరా నాటికి కేబుల్‌ బ్రిడ్జి పూర్తి మంత్రి గంగుల వెల్లడి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జిని దసరా నాటికి పూర్తిచేసి మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. సోమవారం ఆయన వంతెన పనులను పరిశీలించారు. బ్రిడ్జి పనులు పూర్తయినప్పటికీ భూసేకరణ వల్ల అప్రోచ్‌ రోడ్ల నిర్మాణంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పనులన్నింటినీ అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నామని, డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్‌ 2 నాటికి బ్రిడ్జిపైనుంచి రాకపోకలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు మంత్రి గంగుల కరీంనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతోపాటు హరితహారంలో భాగంగా మొక్కలు నాటా రు. ఈసారి జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈసారి నాటిన మొక్కల్లో 80 శాతం కాపాడకుంటే కొత్త చట్టం ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదన్నారు. మంత్రి వెంట నగర మేయర్‌ వై సునీల్‌రావు తదితరులు ఉన్నారు.


logo