మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 13:12:06

ప్ర‌జా సేవ‌లో ఆరోగ్య శాఖ నిమ‌గ్నం : మ‌ంత్రి ఈట‌ల‌

ప్ర‌జా సేవ‌లో ఆరోగ్య శాఖ నిమ‌గ్నం : మ‌ంత్రి ఈట‌ల‌

హైద‌రాబాద్ : ప‌్ర‌జా సేవ‌లో ఆరోగ్య శాఖ నిమ‌గ్న‌మైంద‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బ‌లోపేతానికి సీఎం కేసీఆర్ నియ‌మించిన కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ అయింది. ఈ స‌మావేశంలో మంత్రులు ఈట‌ల రాజేంద‌ర్‌, కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంత‌రం ప‌ని చేసే శాఖ అని పేర్కొన్నారు. కొవిడ్ నేప‌థ్యంలో గ‌త 6 నెల‌లుగా ప్ర‌జ‌లంద‌రూ నివాసాల‌కు మాత్ర‌మే ప‌రిమితమైతే, ఆరోగ్య శాఖ మాత్రం ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మైంద‌ని తెలిపారు. కరోనా ప్ర‌భావంతో వైద్య శాఖ‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ర్టంలో వైద్యారోగ్య శాఖ‌ను బ‌లోపేతం చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించార‌ని మంత్రి గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో వైద్యారోగ్య శాఖ‌ను బ‌లోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 

అద్భుతంగా వైద్యారోగ్య శాఖ ప‌నితీరు : మ‌ంత్రి కేటీఆర్

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా ప‌ని చేస్తోంది అని మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా వైద్యారోగ్య శాఖ‌లో ప‌ని చేస్తున్న వారంద‌రికీ కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌త ఆరేళ్లుగా వైద్యారోగ్య శాఖ అద్భుతంగా ప‌ని చేస్తూ.. ఎన్నో విజ‌యాలు సాధించింద‌ని మంత్రి కొనియాడారు. క‌రోనా సంద‌ర్భంగా మెడిక‌ల్ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్చ‌ర్‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్య ఆరోగ్య శాఖలు క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్లే ఈ సారి సీజ‌న‌ల్ వ్యాధులు కూడా బాగా త‌గ్గాయ‌ని చెప్పారు. రోగాలు, వ్యాధుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో బాగా అవ‌గాహ‌న పెరిగింద‌న్నారు. ఇత‌ర రాష్ర్టాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్ర‌స్తుతం మ‌న రాష్ర్టంలో క‌రోనా అదుపులోనే ఉంద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 


logo