బుధవారం 27 మే 2020
Telangana - May 07, 2020 , 05:56:57

టీఎస్ విద్యాక్యాలండ‌ర్‌పై త్వ‌ర‌లో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ

టీఎస్ విద్యాక్యాలండ‌ర్‌పై త్వ‌ర‌లో క్యాబినెట్ స‌బ్ క‌మిటీ

హైద‌రాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర విద్యాక్యాలండ‌ర్‌పై త్వ‌ర‌లో క్యాబినెట్ స‌బ్‌క‌మిటీ వేయ‌నున్నారు. క‌రోనా ప్ర‌భావం, లాక్‌డౌన్ స‌డ‌లింపు, నూత‌న విద్యాసంవ‌త్స‌ర ప్రారంభం త‌దిత‌ర అంశాలపై స‌బ్‌క‌మిటీ అధ్య‌య‌నం చేయ‌నుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఏర్పాట్ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే డీఈవోల‌కు ఆదేశాలు జారీ చేసింది. మునుప‌టి క‌న్నా ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష కేంద్రాలు పెర‌గ‌నున్నాయి. విద్యార్థుల‌కు నిర్ణీత దూరం పాటించేలా చూడ‌నున్నారు. 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఇప్ప‌టికే మూడు ప‌రీక్ష‌లు ముగిశాయి. మిగిలిన 8 ప‌రీక్ష‌లు బెంచికి ఒక‌రిని కూర్చోబెడుతామ‌ని అధికారులు తెలిపారు. హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన 10 రోజుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంది. ప‌ది ప‌రీక్ష‌ల‌కు 5.3 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు.


logo